రోలర్ కోస్టర్ వంతెన
‘రోడ్డు అలా నిలువుగా ఉండడమేంటీ... దానిమీది నుంచి కార్లు జారిపడిపోకుండా పైకెక్కడమూ దిగడమూ ఏంటీ... ఇదేదో ఫొటోషాప్‌లో చేసిన మాయ అయి ఉంటుందిలే’... ఈ వంతెనను ఫొటోల్లో చూసినవారెవరైనా ఇలా అనుకోవడం సహజమే. కానీ ఇక్కడ కనిపించేది ముమ్మాటికీ నిజం. జపాన్‌లోని మట్సు, సకైమినటొ నగరాల్ని కలుపుతూ స్థానిక నకౌమి సరస్సు మీద కట్టిన వంతెన ఇది. దీని కింది నుంచి నౌకలు వెళ్లేందుకు వీలుగా మధ్యలో బాగా ఎత్తు పెంచి కట్టారు. వాలు చాలా తక్కువ ఉండే ఈ దార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే జనానికి రోలర్ కోస్టర్ ఎక్కిన అనుభూతి కలుగుతుందట. అందుకే, దీన్ని రోలర్ కోస్టర్ వంతెన అంటారు.
No comments:
Post a Comment