శ్రీలంక అభిమానికి రోహిత్ సాయం
కష్టాల్లో ఉన్న ఓ అభిమానికి టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సహాయం చేసి తన ఉదారతను చాటుకున్నాడు. అది కూడా దేశం కాని దేశం వచ్చిన శ్రీలంక అభిమానికి సహాయం చేసి మంచి మనసున్న వ్యక్తి అని నిరూపించుకున్నాడు. భారత్-శ్రీలంక జట్ల సిరీస్ చూసేందుకు గాను మొహ్మద్ నిలామ్ అభిమాని భారత్ పర్యటనకు వచ్చారు. అయితే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నిలామ్ తండ్రి ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. ఈ క‍్రమంలోనే ఢిల్లీలో చివరి టెస్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిలామ్‌ను ఉన్నపళంగా లంకకు బయల్దేరి రావాలంటూ ఇంటి సభ్యులు ఫోన్ చేశారు. అయితే ఢిల్లీ నుంచి కొలొంబో వెళ్లేందుకు నిలామ్ వద్ద సరిపడా డబ్బులేక పోవడంతో ఇబ్బంది పడ్డాడు. టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ వీరాభిమాని ఆయన సుధీర్ గౌతం ద్వారా ఈ విషయం రోహిత్ శర్మలకు చేరింది. అతన్ని వెంటనే పిలిపించుకుని టికెట్‌కు సరిపడా రూ. 20వేల నగదు అందజేశాడు రోహిత్.
ఈ విషయాన్ని నిలామ్ మంగళవారం ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించాడు. 'భారత జట్టు బస చేస్తున్న హోటల్‌కి నన్ను రోహిత్ ఆహ్వానించి నాకు టికెట్‌కు సరిపడా డబ్బులు ఇచ్చాడు. మా నాన్న సర్జరీ బాగా జరిగింది. ఆయన ఆరోగ్యం బాగుంది. మా నాన్న ఆరోగ్యం బాగాలేదని తెలియగానే చాలా కంగారుపడ్డా. రోహిత్‌ది చాలా పెద్ద మనస్సు. వెంటనే నన్ను పిలిచి రిటర్న్ టికెట్ కోసం సాయపడ్డాడు' అని నిలామ్ తెలిపాడు.

No comments:
Post a Comment