Thursday, 14 December 2017
రోహిత్ 208: ఆనందబాష్పాలతో సతీమణి
మొహాలి స్టేడియంలో టీమిండియా సారథి రోహిత్ శర్మ మోత మోగించాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వర్షం కురిపించి ద్విశతకం నమోదు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లపై బ్యాటింగ్‌తో విరుచుకుపడుతున్న రోహిత్‌ను చూసి గ్యాలరీలో ఉన్న ఆయన భార్య రితిక తెగ మురిసిపోయింది. అతడు డబుల్ సెంచరీ చేయగానే ఒకింత భావోద్వేగానికి లోనైంది. ఆనంద బాష్పాలు రాల్చింది. లేచి నిల్చుని చప్పట్లతో భర్తను అభినందించింది.
మొహాలి స్టేడియంలో టీమిండియా సారథి రోహిత్ శర్మ మోత మోగించాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వర్షం కురిపించి ద్విశతకం నమోదు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లపై బ్యాటింగ్‌తో విరుచుకుపడుతున్న రోహిత్‌ను చూసి గ్యాలరీలో ఉన్న ఆయన భార్య రితిక తెగ మురిసిపోయింది. అతడు డబుల్ సెంచరీ చేయగానే ఒకింత భావోద్వేగానికి లోనైంది. ఆనంద బాష్పాలు రాల్చింది. లేచి నిల్చుని చప్పట్లతో భర్తను అభినందించింది.
వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా ఘనత సాధించిన రోహిత్‌శర్మ తన ఆనందాన్ని మైదానం నుంచే భార్య రితికతో పంచుకున్నాడు. రితికకు గాల్లో ముద్దులు విసిరాడు. అన్నట్లు రోహిత్ జీవితంలో ఈ రోజు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజు రోహిత్ రెండో పెళ్లిరోజు. 2015 డిసెంబర్ 13న రోహిత్ తన మేనేజర్ అయిన రితికను వివాహం చేసుకున్నాడు.
ఈ వన్డేలో భారత్ శ్రీలంకకు 393 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ రోహిత్ శర్మ 208 పరుగులతో అజేయంగా నిలవగా.. శిఖర్ ధావన్ 68, శ్రేయస్ అయ్యర్ 88 పరుగులతో రోహిత్‌కు సహకారం అందించారు. ఈ వన్డేలో రోహిత్ 13 ఫోర్లు, 12 సిక్స్‌లతో దుమ్మురేపాడు.
ధోని 'లైక్'పై విమర్శలు!
మైదానంలో ఎప్పుడూ కూల్‌గా ఉండే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తాజాగా ఓ ట్వీట్‌కు లైక్ కొట్టి నెటిజన్ల విమర్శలకు గురయ్యాడు. 2019 వరల్డ్ కప్ టీమిండియాదేనంటూ ఒక వెబ్సైట్లో వచ్చిన కథనానికి మన మహేంద్రుడు లైక్ కొట్టడం ఇందుకు కారణమైంది. అసలేం జరిగిందంటే.. వచ్చే వన్డే వరల్ఢ్ కప్ టీమిండియాదే, మ్యాచ్ ఫిక్స్డ్ అంటూ ఇన్‌కబార్ అనే వార్త సంస్థ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. దీనికి ఎంఎస్ ధోని లైక్ కొట్టాడు. ఇప్పుడు ఆ ట్వీట్ కంటే కూడా ధోని లైక్ కొట్టడాన్ని నెటిజన్లు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
'ఈ ట్వీట్‌ను ధోని లైక్ చేయాల్సిన పని ఏమొచ్చిందంటూ ఒక అభిమాని నిలదీయగా, 2019 వరల్డ్ కప్‌ను టీమిండియానే గెలుస్తుందనే ట్వీట్‌కు ధోని ఎందుకు లైక్ చేసినట్లని మరొక అభిమాని ప్రశ్నించాడు. ఇక్కడ ధోని మ్యాచ్ ఫిక్స్డ్ అనే పదాన్ని మరిచిపోయాడా అంటూ మరొక అభిమాని ట్వీట్ చేశాడు. భారత్ జట్టు 2019 వరల్ఢ్ కప్‌ను గెలుస్తుంది.. అంత వరకూ బాగానే ఉంది. మ్యాచ్‌లు ఫిక్స్‌లు కావు అనేది ధోని తెలుసుకోవాలని వేరే అభిమాని సెటైర్ వేశాడు. ఒకవేళ మ్యాచ్ పిక్సింగ్ అనే దాన్ని క్రికెట్ నుంచి తొలగిస్తే, పాకిస్తాన్ ప్రతీ మ్యాచ్ గెలుస్తుందని సదరు అభిమాని చమత్కరించాడు. కాగా, కొంతమంది ధోని ట్వీట్‌ను లైక్ చేయడంలో తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంచితే, 2009లో ట్విట్టర్ సభ్యత్వం తీసుకున్న ధోని.. 2013లో ఒక ట్వీట్‌కు , 2014లో మరొక ట్వీట్‌కు లైక్ కొట్టాడు. దాదాపు మూడేళ్ల తరువాత ట్వీట్ లైక్ కొట్టి విమర్శలను చవిచూశాడు.
శ్రీలంక అభిమానికి రోహిత్ సాయం
కష్టాల్లో ఉన్న ఓ అభిమానికి టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సహాయం చేసి తన ఉదారతను చాటుకున్నాడు. అది కూడా దేశం కాని దేశం వచ్చిన శ్రీలంక అభిమానికి సహాయం చేసి మంచి మనసున్న వ్యక్తి అని నిరూపించుకున్నాడు. భారత్-శ్రీలంక జట్ల సిరీస్ చూసేందుకు గాను మొహ్మద్ నిలామ్ అభిమాని భారత్ పర్యటనకు వచ్చారు. అయితే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నిలామ్ తండ్రి ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో చివరి టెస్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిలామ్ను ఉన్నపళంగా లంకకు బయల్దేరి రావాలంటూ ఇంటి సభ్యులు ఫోన్ చేశారు. అయితే ఢిల్లీ నుంచి కొలొంబో వెళ్లేందుకు నిలామ్ వద్ద సరిపడా డబ్బులేక పోవడంతో ఇబ్బంది పడ్డాడు. టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ వీరాభిమాని ఆయన సుధీర్ గౌతం ద్వారా ఈ విషయం రోహిత్ శర్మలకు చేరింది. అతన్ని వెంటనే పిలిపించుకుని టికెట్‌కు సరిపడా రూ. 20వేల నగదు అందజేశాడు రోహిత్.
ఈ విషయాన్ని నిలామ్ మంగళవారం ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించాడు. 'భారత జట్టు బస చేస్తున్న హోటల్‌కి నన్ను రోహిత్ ఆహ్వానించి నాకు టికెట్‌కు సరిపడా డబ్బులు ఇచ్చాడు. మా నాన్న సర్జరీ బాగా జరిగింది. ఆయన ఆరోగ్యం బాగుంది. మా నాన్న ఆరోగ్యం బాగాలేదని తెలియగానే చాలా కంగారుపడ్డా. రోహిత్‌ది చాలా పెద్ద మనస్సు. వెంటనే నన్ను పిలిచి రిటర్న్ టికెట్ కోసం సాయపడ్డాడు' అని నిలామ్ తెలిపాడు.
Subscribe to:
Comments (Atom)


