మగధీరుడి ఇంట్లో యమదొంగ!

దర్శకధీరుడు రాజమౌళి ఓ పక్క ఎన్టీఆర్, మరోపక్క రామ్‌చరణ్‌ను పెట్టుకుని మధ్యలో ఆయన కూర్చున్న ఫొటోను ట్వీట్ చేసి ఈ మధ్య అభిమానుల్లో ఆసక్తి పెంచారు. రాజమౌళి ఓ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారని, అందులో ఎన్టీఆర్–చరణ్ హీరోలుగా నటించడానికి అంగీకరించారన్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఎవరూ అధికారికంగా ప్రకటించకపోయినా కానీ, కథపై కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.
అయితే తాజాగా రామ్‌చరణ్ ఇంట్లో జరిగిన ఫ్రీ క్రిస్మస్ మేడుకలకు ఎన్టీఆర్ తన కుటుంబంతో హజరయ్యారు. వారితోతో పాటు యువ కథానాయకుడు శర్వానంద్, ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ ఫొటోను ఉపాసన అభిమానులతో పంచుకున్నారు. చెర్రీ భార్య ఉపాసన విస్తరాకులతో క్రిస్మస్ చెట్టును తయారు చేశారు. ‘ఈ క్రిస్మస్ చెట్టును విస్తరాకులతో నేనే తయారు చేశా. మిస్టర్ ‘సి’తో ఉన్న వ్యక్తులను గుర్తు పట్టగలరా?’ అంటూ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ‘రంగస్థలం’లో నటిస్తున్న చరణ్, ఆ సినిమా తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోయే సినిమా, చరణ్–బోయపాటి సినిమా ఇంచుమించు ఒకేసారి పూర్తవుతాయి. అప్పుడు ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి తీయబోయే మల్టీస్టారర్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
No comments:
Post a Comment