ప్రేక్షకుడి తుది తీర్పు వచ్చే వరకూ ఏ సినిమా హిట్టో ఏది ఫట్టో చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కథ విన్నప్పుడే సినిమా భవితవ్యాన్నీ ప్రేక్షకుల నాడినీ అంచనావేయాలంటే కాస్త కష్టమే. డేట్లు సర్దుబాటు కాలేదనో, ప్రేక్షకులకు నచ్చదనో, క్లైమాక్స్ బాలేదనో... ఇలా కారణం ఏదైనా ఒక హీరో వదులుకున్న కథతో మరొకరు సూపర్ హిట్ కొట్టిన సందర్భాలు కోకొల్లలు. ఇటీవల విజయవంతమైన కొన్ని సినిమాలు ముందుగా ఎవరి తలుపు తట్టాయో చూస్తే..
విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలిచింది. నిజానికి ఇది శర్వానంద్ ఖాతాలో చేరాల్సింది. ఈ సినిమా దర్శకుడు సంకల్ప్ రెడ్డి వంగా ముందుగా ఈ కథని శర్వానంద్‌కి వినిపించాడు. అయితే, డేట్లు సర్దుబాటుకాకపోవడంతో అతడు దీన్ని వదులుకున్నాడు. అర్జున్ రెడ్డి క్యారెక్టర్‌కి తనకంటే విజయ్ దేవరకొండే న్యాయం చేశాడంటూ శర్వానంద్ కితాబు ఇచ్చాడు కూడా.
|
ఇటీవలే విడుదలై సూపర్ హిట్టైన సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. ఈ స్క్రిప్ట్ ముందుగా విన్నది రాజశేఖర్. కానీ, ఆయనకి క్లైమాక్స్ నచ్చలేదు. దీంతో దర్శకుడు తేజ రానాను ఒప్పించి సినిమాను పట్టాలెక్కించాడు. రిలీజైన తర్వాత రానా కెరియర్‌లో మరో హిట్‌గా నిలిచింది.
|
అవకాశాలను అందిపుచ్చుకోవడంలో నాని ఒకింత ముందున్నాడు. మంచి క్యారెక్టర్లు చేస్తూ అందరి మన్ననలూ పొందుతున్న నాని నటించి, మెప్పించిన చిత్రం ‘నిన్ను కోరి’. నిజానికి ఈ సినిమాని మొదట హీరో కార్తి చేయాల్సిందట. డేట్లు సర్దుబాటు అవకపోవడంతో కార్తి దాన్ని వదులుకున్నాడు.
|
మాస్ మహారాజ్ రవితేజకి రెండేళ్ల తర్వాత హిట్టిచ్చిన చిత్రం ‘రాజా ది గ్రేట్’. అయితే ఇది యంగ్ హిరో రామ్‌కి దక్కాల్సిన విజయం. కథÅ]ని సిద్ధంచేసుకోగానే తొలుత రామ్‌కి వినిపించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే డేట్స్ కుదరకపోవడంతో రామ్ ఆ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో రవితేజకి కథ చెప్పడం, ఆయనకి నచ్చి ఓటెయ్యడం, హిట్‌ని సొంతం చేసుకోవడం చకచకా జరిగిపోయాయి.
|
గ్రామాల దత్తత అంశంతో రూపొందించిన సినిమా ‘శ్రీమంతుడు’. ఇందులో మహేష్‌బాబు చేసిన క్యారెక్టర్‌లో మనం జూనియర్ ఎన్టీఆర్‌ని చూడాల్సింది. దర్శకుడు కొరటాల శివ చెప్పిన కథ జూనియర్‌ని ఆకట్టుకోలేకపోయింది. అలా శ్రీమంతుడు సినిమా జూనియర్ చేతిలోంచి వెళ్లి మహేష్‌బాబు తలుపుతట్టింది. ఈ సినిమాకు మహేష్‌బాబు ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించాడు.
|
No comments:
Post a Comment